మేడ్చల్ అన్నోజీగూడలో ప్రమాదం..మంటలతో పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన మినీ వ్యాన్..

మేడ్చల్ అన్నోజీగూడలో  ప్రమాదం..మంటలతో పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన మినీ వ్యాన్..

మేడ్చల్ జిల్లా  పోచారం పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడలో భారీ ప్రమాదం తప్పింది. ఘట్ కేసర్ వైపు నుంచి ఉప్పల్ వస్తున్న ఓమ్ని మినీ వ్యాన్ లో గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.దీంతో వ్యాన్ లో ఉన్నవారు ఒక్కసారిగా వ్యాన్ ను రోడ్డుపై నిలిపి బయటపడ్డారు.

 ఇంతలో మంటలతో ఉన్న వ్యాన్ ఒక్కసారిగా కంట్రోల్ తప్పి సమీపంలోని భారత్ పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. దీంతో బంకు సిబ్బంది వాహనదారులు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనై పరుగులు తీశారు.  

మంటలు కాస్త తగ్గిన తర్వాత పెట్రోల్ బంకు సిబ్బంది ఫైర్ సామాగ్రితో మంటలను ఆర్పివేశారు. అనంతరం పెట్రోల్ బంక్ సిబ్బంది అక్కడ ఉన్న వాహనదారులు కలసి వ్యాన్ ను బయటకు నెట్టారు. ఈ ఘటనను దగ్గర్లో ఉన్న  వారు వీడియో తీయడంతో వైరల్ అవుతోంది.