మేడారంలో పేదలకు దుప్పట్లు పంపిణీ

మేడారంలో పేదలకు దుప్పట్లు పంపిణీ

తాడ్వాయి, వెలుగు : చలి తీవ్రంగా ఉండడంతో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంతో పాటు రెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లోని పేదలకు హైదరాబాద్​ శ్రియ ఇన్ఫోటెక్  ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్​వేర్ కంపెనీ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా కల్యాణి మాట్లాడుతూ శ్రియ ఇన్ఫోటెక్  ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు పేదలకు దుప్పట్లు పంపించినందుకు వారిని అభినందించారు. కార్యక్రమంలో మేడారం సర్పంచ్ పీరీల భారతి వెంకన్న, కాంగ్రెస్​ పార్టీ తాడ్వాయి మండలాధ్యక్షుడు బొల్లు దేవేందర్, సహకార సంఘం మాజీ చైర్మన్ సంపత్ గౌడ్, మాజీ ఎంపీటీసీ బత్తిని రాజు, మేడారం యూత్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.