- దీనిపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలి: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన ఫామ్ హౌస్‌లో డ్రగ్స్తీసుకుంటూ దొరికిపోయారని ఎమ్మెల్యే బి.మనోహర్ రెడ్డి అన్నారు. దీనిపై బీఆర్ఎస్నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. ఆదివారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఫామ్‌హౌస్‌లో రోహిత్ రెడ్డితోపాటు ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నమీత్ శర్మ ఉన్నారని, వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాలేమిటో బయటకు రావాలన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మార్చారని, ఆనాడు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగిందని మండిపడ్డారు. డ్రగ్స్ రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
