నర్సంపేటలో  అనుమానాస్పద స్థితిలో డాక్టర్‌‌‌‌ మృతి

నర్సంపేటలో  అనుమానాస్పద స్థితిలో డాక్టర్‌‌‌‌ మృతి
  • అత్తింటి వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఆరోపణ
  • వరంగల్‌‌‌‌ జిల్లా నర్సంపేటలో ఘటన

నర్సంపేట, వెలుగు : అనుమానాస్పద స్థితిలో ఓ డాక్టర్‌‌‌‌ చనిపోయాడు. ఇందుకు అత్తింటి వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన వరంగల్‌‌‌‌ జిల్లా నర్సంపేటలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌‌‌మెట్‌‌‌‌ మండలం కుర్మగూడెంనకు చెందిన జొన్నిడ శ్రీనివాస్‌‌‌‌రెడ్డి కుమారుడు శశిధర్‌‌‌‌రెడ్డి (36), నర్సంపేటకు చెందిన మట్టా సింధూర మెడిసిన్‌‌‌‌ చదువుతున్న టైంలో ప్రేమించుకొని, 2016లో పెండ్లి చేసుకున్నారు. 2020లో నర్సంపేటలో శశి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌ ప్రారంభించారు. శశిధర్ రెడ్డి శనివారం రాత్రి హాస్పిటల్‌‌‌‌లో పడుకుంటానని చెప్పి వెళ్లాడు.

ఉదయం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా.. చనిపోయి కనిపించాడు. వెంటనే కుర్మగూడెంలో ఉంటున్న తండ్రి శ్రీనివాస్‌‌‌‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. వారు నర్సంపేటకు చేరుకొని శశిధర్‌‌‌‌రెడ్డి మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. తన కుమారుడిపై అతడి భార్య గృహహింస కేసు పెట్టి వేధిస్తోందని, అతడి మృతికి భార్యతో పాటు  అత్తమామలు మధుసూధన్‌‌‌‌రెడ్డి, పద్మ, బంధువులు నరేందర్‌‌‌‌రెడ్డి, నీరజ కారణమని శ్రీనివాస్‌‌‌‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.