అసెంబ్లీలో అందరం పరీక్షలు చేయించుకుందాం : బీఆర్ఎస్ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

అసెంబ్లీలో అందరం పరీక్షలు చేయించుకుందాం : బీఆర్ఎస్ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
  • సీఎం రేవంత్​రెడ్డి సిద్ధమా?: దాసోజు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​మాజీ ఎమ్మెల్యే పైలెట్​రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్​ఫాంహౌస్ ఘటనపై పారదర్శకంగా విచారణ జరపాలని బీఆర్ఎస్​ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​ డిమాండ్ చేశారు. ఇందులో ఎవరున్నా, వారు ఏ పార్టీకి చెందిన వారైనా, ఎంతటి పెద్దవారైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చేందుకే కాంగ్రెస్​నేతలు కేటీఆర్​పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం పూర్తికాగానే.. అక్కడే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం డ్రగ్​టెస్ట్​చేయించుకుందామని, సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరారు. ఫాంహౌస్ పార్టీలో టీడీపీ ఎంపీ మహేశ్ యాదవ్‌‌‌‌తోపాటు వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నారని, డ్రగ్స్ దొరికాయని పోలీసులు చెబుతున్న నేపథ్యంలో నిజానిజాలను వెలికితీయాలని కోరారు. ముఖ్యమంత్రి సహవాస దోషంతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​గౌడ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.