మైక్ ఇవ్వబోయిన యాంకర్.. దణ్ణం పెట్టి వద్దన్న నటుడు శివాజీ

మైక్ ఇవ్వబోయిన యాంకర్.. దణ్ణం పెట్టి వద్దన్న నటుడు శివాజీ

హీరోయిన్ల వస్త్రధారణపై ఉచిత సలహా ఇచ్చి.. నోరు జారి విమర్శల పాలైన టాలీవుడ్ నటుడు శివాజీ ‘దండోరా’ సక్సెస్ మీట్తో మరోసారి వార్తల్లో నిలిచారు. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ సక్సెస్ మీట్లో మాట్లాడిన ఆయన.. మీడియా ప్రతినిధుల Q&A సెషన్లో తొలుత మాట్లాడేందుకు నిరాకరించారు. యాంకర్ తొలుత మైక్ తీసుకెళ్లి శివాజీకే ఇవ్వాలని ప్రయత్నించగా.. దణ్ణం పెట్టి మైక్ వద్దని శివాజీ సున్నితంగా తిరస్కరించారు. మిగిలిన వాళ్లు మాట్లాడాక శివాజీ కూడా మాట్లాడారు. సినిమా విజయం సాధించిందని.. సినిమా గురించి మాత్రమే మాట్లాడదామని శివాజీ చెప్పారు. దండోరా సినిమాకు తన వ్యక్తిగత విషయాలను ముడిపెట్టొద్దని ఆయన కోరారు.

శివాజీ వ్యాఖ్యలు ఎందుకు వివాదాస్పదం అయ్యాయంటే..
శివాజీ ఆ రోజు ఏం మాట్లాడారో ఆయన వ్యాఖ్యలు యథాతథంగా.. ‘‘ఈ ఈవెంట్కి యాంకర్గా చేసిన స్రవంతి డ్రెస్ సెన్స్ బాగుంది. హీరోయిన్స్ కూడా ఎలా బడితే అలా బట్టలు వేసుకోకూడదు. ఆ దరిద్రం మళ్ళీ మనమే అనుభవించాల్సి ఉంటుంది. నిజంగా ఆడవాళ్ళ అందం అనేది చీరల్లో, నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది. అప్పుడే వారి గౌరవం పెరుగుతుంది. 

పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే పైకి నవ్వుతూ బాగుంది అంటారు. కానీ లోపల మాత్రం దరిద్రపు ము**, ఇలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, మంచివి వేసుకోవచ్చుగా బాగుంటావుగా అని తిట్టుకుంటారు. మళ్లీ ఇలా అంటే స్త్రీ స్వాతంత్ర్యం లేదా స్వేచ్ఛ లేదా అంటారు. స్త్రీ అంటే ప్రకృతితో సమానం. అందుకే ఆమె ఎంత అందంగా కనిపిస్తే అంత గౌరవం పెరుగుతుంది. మహానటి సావిత్రి, సౌందర్య లాంటి హీరోయిన్స్ చాలా మంది మన ఇండస్ట్రీలో ఉన్నారు. గ్లామర్ కుడా ఓ దశవరకు మాత్రమే ఉండాలి” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు శివాజీ. అయితే శివాజీ చేసిన వ్యాఖ్యల్లో.. దరిద్రపు ము** అనే పదం వివాదాస్పదంగా మారింది.

►ALSO READ | Anasuya vs Sivaji: 'తగ్గేదే లే'.. శారీ టూ స్విమ్ సూట్.. నెట్టింట వైరల్ అవుతున్న అనసూయ లేటెస్ట్ వీడియోలు!

వస్త్రధారణ అనేది మహిళల హక్కు అని.. ఉచిత సలహాలు ఇవ్వడానికి ఆయనెవరని.. అనసూయ, చిన్మయి శివాజీ వ్యాఖ్యలను ఖండించడంతో వివాదం మరింత ముదిరింది. శివాజీ మాట్లాడిన భాష, వాడిన పదాలు తప్పేనని.. కానీ ఆయన చేసిన హిత బోధ మంచిదేనని కరాటే కల్యాణి లాంటి కొందరు ఆయనను సమర్థించడంతో టాలీవుడ్లో ఈ వివాదం హాట్ టాపిక్ అయింది. 

విషయం పెద్దది కావడంతో.. దండోరా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌‌లో మహిళల దుస్తుల పట్ల తాను చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ ప్రెస్ మీట్‌‌ నిర్వహించి క్షమాపణలు చెప్పారు. ఆ వేదికపై తాను రెండు అనుచితమైన పదాలు వాడినందుకు పశ్చాత్తాపం చెందుతున్నానని, ఆ మాటలు పూర్తిగా తప్పేనని ఆయన అంగీకరించారు. ఆ రెండు ప‌‌దాలు అన్‌‌పార్లమెంటరీ వర్డ్స్‌‌ కాబట్టి అంద‌‌రికీ సిన్సియ‌‌ర్‌‌గా క్షమాప‌‌ణ‌‌లు చెబుతున్నానని, కానీ తాను ఇచ్చిన స్టేట్‌‌మెంట్‌‌కు మాత్రం క‌‌ట్టుబ‌‌డే ఉన్నానని స్పష్టం చేశారు.