హైదరాబాద్ కాచిగూడలో విషాదం.. ఏసీలో షార్ట్ సర్క్యూట్.. ఫైర్ యాక్సిడెంట్ కారణంగా కవలల్లో ఒకరు మృతి

హైదరాబాద్ కాచిగూడలో విషాదం.. ఏసీలో షార్ట్ సర్క్యూట్.. ఫైర్ యాక్సిడెంట్ కారణంగా కవలల్లో ఒకరు మృతి

హైదరాబాద్: హైదరాబాద్ కాచిగూడ సుందర్ నగర్లోని ఓ ఇంట్లో ఫైర్ ఆక్సిడెంట్ జరిగింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కవలల్లో ఒకరైన రహీం అనే మూడేళ్ల పిల్లాడు మృతి చెందాడు. మరో బాలుడు రెహమాన్కు గాయాలయ్యాయి. 

రహీం, రెహమాన్ మూడేళ్ళ వయసున్న కవల పిల్లలు. చనిపోయిన రహీం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి, తీవ్రంగా గాయపడిన రెహమాన్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు పోలీసులు తరలించారు. పిల్లల తండ్రి పేరు సైఫుద్దీన్ ఖాదిర్. ఇతను ఒక ప్రైవేట్ ఉద్యోగిగా తెలిసింది. 

మరో అగ్ని ప్రమాద వార్త శుక్రవారం కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడలో భారీ ప్రమాదం తప్పింది. ఘట్ కేసర్ వైపు నుంచి ఉప్పల్ వస్తున్న ఓమ్ని మినీ వ్యాన్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో వ్యాన్లో ఉన్నవారు ఒక్కసారిగా వ్యాన్ను రోడ్డుపై నిలిపి బయటపడ్డారు.

►ALSO READ | ఎటు పోతుందో ఈ సమాజం.. తాగిన మత్తులో భార్య చేతిని నరికి చెరువులో విసిరేశాడు !

ఇంతలో మంటలతో ఉన్న వ్యాన్ ఒక్కసారిగా కంట్రోల్ తప్పి సమీపంలోని భారత్ పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. దీంతో బంకు సిబ్బంది వాహనదారులు ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనై పరుగులు తీశారు. కాగా మంటలు కాస్త తగ్గడంతో పెట్రోల్ బంకు సిబ్బంది ఫైర్ సామాగ్రితో మంటలను ఆర్పివేశారు. అనంతరం పెట్రోల్ బంక్ సిబ్బంది అక్కడ ఉన్న వాహనదారులు కలసి వ్యాన్ను బయటకు నెట్టారు.