కోహ్లీ ప్రపంచ రికార్డు.. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని రికార్డు బ్రేక్ !

కోహ్లీ ప్రపంచ రికార్డు.. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని రికార్డు బ్రేక్ !

కోహ్లీని కింగ్ అని అందుకే  అన్నారేమో. వరల్డ్ క్రికెట్లో రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతున్నాడు. సచిన్ తర్వాత అంతటి ఆట తీరుతో.. కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తున్న కోహ్లీ.. లిస్ట్-A క్రికెట్ లో కూడా ఇరగదీస్తున్నాడు. వన్డే కెరీర్ అయిపోయినట్లే.. వచ్చే వరల్డ్ కప్ కు అర్హత సాధించేంత ఫామ్ లేదనే విమర్శలు వస్తున్న వేళ.. విజయ్ హజారే ట్రోఫీలో గుజరాత్ పై శుక్రవారం (డిసెంబర్ 26) 77 రన్స్ చేసి.. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని రికార్డును బ్రేక్ చేశాడు. 

50 ఓవర్ల క్రికెట్ లో.. చాలా రోజులుగా ఎవరికీ సాధ్యం కాని రికార్డును కోహ్లీ సాధించాడు. లిస్ట్ -A క్రికెట్లో ఆస్ట్రేలియా లెజెండరీ ఫినిషర్ గా పేరున్న మైకేల్ బెవాన్ రికార్డును బ్రేక్ చేశాడు కోహ్లీ. 

సెంచరీల విషయంలో సచిన్ తో పోల్చుతుంటారు కోహ్లీని. ఎందుకంటే టెండూల్కర్ తర్వాత అలాంటి రికార్డ్సు.. అన్ని సెంచరీలు చేసింది కింగ్ ఒక్కడే కాబట్టి. అయితే లేటెస్ట్ గా కోహ్లీ సాధించిన ఫీట్.. రన్ స్కోరింగ్ లో తనకు తానే సాటి అని చెప్పేలా మైకేల్ బెవాన్ పేరున ఉన్న రికార్డును అధిగమించాడు. లిస్ట్ - A క్రికెట్ లో యావరేజ్ రన్స్ లో టాప్ లో ఉన్న బెవాన్ ను 2వ స్థానానికి పంపి.. టాప్ లో కూర్చున్నాడు కింగ్. 

బెంగళూరులో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ పై 61 బంతుల్లో 77 రన్స్ చేసి.. లిస్ట్ - A క్రికెట్ లో 57.87 యావరేజ్ స్కోర్ ఉన్న టాప్ ప్లేయర్ గా ఉద్భవించాడు. ఇప్పటి వరకు హైయెస్ట్ యావరేజ్ మైకేల్ బెవాన్ పేరున 57.86 దగ్గర ఉంది. 

లిస్ట్ ఎ క్రికెట్‌లో అత్యధిక సగటు సాధించిన బ్యాట్స్‌మెన్:

1. విరాట్ కోహ్లీ (ఇండియా): 57.87
2. మైఖేల్ బెవాన్ (ఆస్ట్రేలియా): 57.86
3. సామ్ హైన్ (ఇంగ్లాండ్): 57.76
4. ఛటేశ్వర్ పుజారా (ఇండియా): 57.01
5. రుతురాజ్ గైక్వాడ్ (ఇండియా): 56.68
6. బాబర్ ఆజం (పాకిస్థాన్): 53.82
7. ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా): 53.46

వన్డే ఫార్మాట్‌లో కెరీర్ ప్రశ్నార్థకంగా ఉన్న తరుణంలో.. కోహ్లీ ఈ పరుగుల జాబితాలో టాప్ ప్లే్స్ లోకి చేరుకోవడం విశేషం. 50 ఓవర్ల ఫార్మాట్‌లో గత 6 ఆటల్లో యావరేజ్ గా150 పరుగులు సాధించాడు. కోహ్లీ ఫామ్ ను అభిమానులు గాడ్ మోడ్ గా  పిలుస్తున్నారు. ఇండియా, ఢిల్లీ తరపున ఇటీవల జరిగిన మ్యాచ్‌లలో కోహ్లీ దాదాపుగా అవుట్ చేయలేని స్థితిలో ఆడుతుండటం విశేషం.

గత ఆరు మ్యాచ్ లలో కోహ్లీ పర్ఫామెన్స్:

ఈ ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో, కోహ్లీ 146.00 సగటుతో 584 పరుగులు చేశాడు.  కోహ్లీ చేసిన స్కోర్లు ఏ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌కైనా కలలా అనిపిస్తుంనటంలో అతిశయోక్తి లేదనుకోవాలి.

- 77 (61) vs గుజరాత్
- 131 (101) vs ఆంధ్ర
- 65* vs దక్షిణాఫ్రికా
- 102 vs దక్షిణాఫ్రికా
- 135 vs దక్షిణాఫ్రికా
- 74 vs ఆస్ట్రేలియా

2025 అంతటా కోహ్లీ అద్భుత ఫామ్ తో ఆకట్టుకున్నాడు. కెరీర్ ఎండింగ్ దశకు చేరుకుంది.. ఇక మునుపటి దూకుడు చూడలేం అని చాలామంది భావించారు. కానీ కింగ్ మరింత  వేగం పెంచి.. ఈ సంవత్సరం లిస్ట్ ఎ క్రికెట్‌లో110 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌ను కొనసాగించాడు.

►ALSO READ | బౌలర్లను ఉతికారేశాడు: గుజరాత్‎పై 29 బంతుల్లోనే కోహ్లీ మెరుపు హాఫ్ సెంచరీ

2025లో జరిగిన అన్ని లిస్ట్ A మ్యాచ్‌లలో, కోహ్లీ సగటు 80ల వద్దనే ఉంది, ఈ సంఖ్య అతను బెవాన్ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా చరిత్రలో లిస్ట్ A లో అత్యంత వేగంగా 16,000 పరుగులను చేరుకున్న ఆటగాడిగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ మునుపటి రికార్డును 61 ఇన్నింగ్స్‌లతో అధిగమించాడు.