హైదరాబాద్‌సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీకి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్ – 1 లో సర్జ్ ట్యాంక్ వద్ద ఉన్న 700 మి.మీ. డయా ఎంఎస్ పైప్ లైన్ కు లీకేజీ ఏర్పడింది. అలాగే నాసర్లపల్లి నుంచి గొడకొండ్ల వరకు ఉన్న 2200 మి.మీ. డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌లో దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీలు, వాల్వ్‌లను మార్చడం, నాసర్లపల్లి వద్ద 2200 మి.మీ. డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై 600 మి.మీ. డయా ఎంఎస్ జంక్షన్ పనులు జరుగుతున్నట్లు మెట్రోవాటర్‌బోర్డు అధికారులు తెలిపారు. కోదండాపూర్, నాసర్లపల్లి పంపింగ్ స్టేషన్లలో ఉన్న 600 మిమీ డయాపై దెబ్బతిన్న బీఎఫ్ వాల్వ్‌లు, ఎన్ఆర్ వీలను మార్చుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఈ నెల 27న ఉదయం 6 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు 36 గంటలు పాటు నీటి సరఫరా ఉండబోదని అధికారులు ప్రకటించారు.
ఈ ప్రాంతాల్లోనే..
మీరాలం, కిషన్‌బాగ్, బాల్షెట్టీ కేట్, మొగల్ పురా, ఫలక్‌నామా, బహదూర్‌పురా, జహనుమా, మహబూబ్ మాన్షన్, సంతోష్ నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, ఆస్మాన్‌గఢ్, యాకుత్‌పురా, బొగ్గులకుంట, నారాయణగూడ, ఆడిక్‌మెట్ రిజర్వాయర్, శివం రిజర్వాయర్, చిల్కలగూడ రిజర్వాయర్, అలియాబాద్ రిజర్వాయర్, రియాసత్ నగర్ రిజర్వాయర్, దిల్ సుఖ్ నగర్, హార్డ్ వేర్ పార్క్, జల్ పల్లి, తుక్కుగూడ, ఫ్యాబ్ సిటీ, మన్నెగూడా తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండబోదని అధికారులు తెలిపారు.
