చిన్న చింతకుంట,వెలుగు : కౌకుంట్ల మండలం ముచ్చింతల నుంచి చిన్న చింతకుంట మండలం ఎర్నాల (ఫర్దిపూర్) గేట్ వరకు బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసిందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చిన్నచింతకుంటలో జూనియర్ కాలేజీ, దేవరకద్రలో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే పల్లమర్రి, ఎర్నాల వద్ద రూ.46 కోట్లతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.
కౌకుంట్ల మండలం ముచ్చింతల నుండి చిన్నచింతకుంట మండలం ఎర్నాల (ఫర్దిపూర్) గేట్ వరకు బ్రిడ్జి నిర్మాణానికి రూ.40 కోట్లు, వడ్డేమాన్ మెయిన్ రోడ్డు నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులు మంజూరు చేసి, జీవో జారీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
మదనాపురం : మదనాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో వివిధ గ్రామాల నుంచి కాలినడకతోవస్తున్న విద్యార్థులు విద్యార్థులకు106 ఉచిత సైకిళ్ల దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి బుధవారం రోజు పంపిణీ చేశారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
