ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు కాంగ్రెస్ కట్టినవే..పనిపాట లేని BRS లీడర్లు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులు కాంగ్రెస్ కట్టినవే..పనిపాట లేని BRS లీడర్లు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు
  • ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు: ఉమ్మడి పాలమూరులోని జూరాల, కోయిల్‌‌‌‌‌‌‌‌సాగర్​, నెట్టెంపాడులతో పాటు  శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్​ తదితర ప్రాజెక్టులు కాంగ్రెస్​ హయాంలో కట్టినవేనని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వనపర్తిలోని పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో డీసీసీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ శివసేనారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.

వనపర్తి జిల్లాలో ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్ల నుంచి 4 టీఎంసీల నీటిని వదిలామన్నారు. పనిపాట లేని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ లీడర్లు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారన్నారు. తాము ప్రెస్​మీట్​పెట్టాకనే నీరు వదిలారని మాట్లాడే బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మాజీ మంత్రి.. ఒక్క రోజులో నాలుగు టీఎంసీల నీటిని వదలడం సాధ్యమా అని ప్రశ్నించారు. 

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కమీషన్ల​ కోసం టెండర్లు పిలిచి ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు. ఈ నెలాఖరులో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ వనపర్తికి రానున్నారని తెలిపారు. ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో మున్సిపల్​చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్​ మాధవి, లీడర్లు ధనలక్ష్మి, బ్రహ్మచారి, సాయిచరణ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, తిరుపతయ్య, బి.కృష్ణ 
పాల్గొన్నారు.