భూభారతి పోర్టల్లో దరఖాస్తులను పరిశీలించాలి : మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్

భూభారతి పోర్టల్లో దరఖాస్తులను పరిశీలించాలి :  మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్

మెదక్​ టౌన్/రామాయంపేట, వెలుగు : మెదక్ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని, 'భూభారతి' పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గతంలో కంటే రికార్డు స్థాయిలో 1,18,000 మెట్రిక్ టన్నులు అదనంగా, మొత్తం 4,28,361 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రైతుల ఖాతాల్లో రూ.1,004.13 కోట్లు జమ చేశామని, వానాకాలం సీజన్ కొనుగోళ్లకు కూడా పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు  సూచించారు. 

అనంతరం రామాయంపేట మండల కేంద్రంలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగయ్యే ఆయిల్ పామ్ సాగు చేయడం ద్వారా రైతులు రెట్టింపు ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ పంటకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోందని,  నేరుగా కంపెనీలే కొనుగోలు చేస్తాయని వివరించారు.