హనుమకొండ జిల్లాలో పాఠాలు బోధించిన కలెక్టర్లు

హనుమకొండ జిల్లాలో పాఠాలు బోధించిన కలెక్టర్లు

వర్ధన్నపేట (ఐనవోలు)/ రఘునాథపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని పాఠశాలలో కలెక్టర్​ చాహత్​బాజ్​పాయ్, జనగామ జిల్లా రఘునాథపల్లి పాఠశాలలో కలెక్టర్​ సందీప్​కుమార్​ఝా విద్యార్థులకు పాఠాలు బోధించారు. బుధవారం వారు పంథిని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, రఘునాథపల్లి కేజీబీవీ ఖిలాషాపూర్ జడ్పీహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ ను ఆకస్మిక తనిఖీలు చేశారు. 

విద్యార్థుల సమర్థ్యాలను పరిశీలించారు. వారికి అందిస్తున్న భోజనం, సమస్యలపై ఆరా తీశారు. పంథిని పాఠశాలలో నిర్వహిస్తున్న అంగన్​వాడీ కేంద్రాన్ని కలెక్టర్​ చాహత్​బాజ్​పాయ్​ సందర్శించి చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. గర్భిణులు, బాలింతలకు గుడ్లు, బాలామృతం పంపిణీ చేశారు.