మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా ఈనెల 1 నుంచి 31 వరకు పోలీస్ యాక్టు అమలులో ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు.
