మెదక్: ఇద్దరు పంచాయతీ సెక్రెటరీల సస్పెన్షన్

మెదక్: ఇద్దరు పంచాయతీ సెక్రెటరీల సస్పెన్షన్

మెదక్​ టౌన్​, వెలుగు : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఖాళీ స్థలానికి యాజమాన్య ధ్రువపత్రంతో పాటు ఇంటి నెంబర్, అసెస్​మెంట్​ ఇచ్చి విధుల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఇద్దరు పంచాయతీ సెక్రటరీలను సస్పెండ్​ చేసినట్లు మెదక్​ జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య బుధవారం తెలిపారు.

చిన్నశంకరంపేట గ్రామపంచాయతీలో వివాదంలో ఉన్న  స్థలంలో  సరైన లింక్ డాక్యుమెంట్లు, స్థల పరిశీలన  చేయకుండా ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వడంతో పంచాయతీ కార్యదర్శులు ఆర్​ సంతోష్​ కుమార్, సీహెచ్​ ప్రదీప్​ కుమార్​లను సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వారు ప్రస్తుత కార్యస్థానాలు విడిచి వెళ్లరాదని డీపీవో యాదయ్య సూచించారు.