బంపర్ ఆఫర్: సగం ధరకే ఐఫోన్ 14.. ఎక్కడో తెలుసా?

బంపర్ ఆఫర్: సగం ధరకే ఐఫోన్ 14.. ఎక్కడో తెలుసా?

ఆపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగానే ఒక అద్భుతమైన అవకాశం. సాధారణంగా ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్ల కోసం అందరూ అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ సేల్స్ కోసం ఎదురుచూస్తుంటారు. కానీ అనూహ్యంగా ఈసారి రిలయన్స్ డిజిటల్ అందరికంటే తక్కువ ధరకే ఐఫోన్ 14(iPhone 14) ను విక్రయిస్తోంది. లాంచ్ ధరతో పోలిస్తే దాదాపు సగం ధరకే ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. 

రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ 14 ప్రారంభ ధర ప్రస్తుతం రూ.48వేల 403గా లిస్ట్ చేయబడింది. అయితే ఆఫర్లు అక్కడితో ఆగలేదు. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి అదనంగా మరో రూ.3వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనివల్ల ఫోన్ ఎఫెక్టివ్ ధర కేవలం రూ.45వేల 403 కు తగ్గుతుంది. ఐఫోన్ 14 తొలిసారిగా మార్కెట్లోకి వచ్చినప్పుడు దీని ధర రూ.79వేల 900 గా ఉండేది. అంటే ప్రస్తుత ఆఫర్ ద్వారా వినియోగదారులు ఏకంగా రూ. 34వేల 497 వరకు ఆదా చేసుకోవచ్చు. భారత్ వంటి మార్కెట్‌లో ఐఫోన్ ధర ఇంతలా తగ్గడం చాలా అరుదుగా వచ్చే అవకాశం.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఐఫోన్ 14 ఎంతో శక్తివంతమైన A15 బయోనిక్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది మల్టీటాస్కింగ్, గేమింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది. ఇది వినియోగదారులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందిస్తుంది. భద్రత కోసం ఫేస్ ఐడి, అత్యవసర సమయాల్లో ప్రాణాలను రక్షించే క్రాష్ డిటెక్షన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ALSO READ : నువ్వెంత మంచి ఓనర్ బాసు.. 

కెమెరా విభాగంలో వెనుకవైపు రెండు 12 ఎంపి కెమెరాలు (మెయిన్ + అల్ట్రా వైడ్) ఉన్నాయి. ఇవి తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫోటోలు తీయగలవు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 12 ఎంపి ట్రూడెప్త్ కెమెరాను అందించారు. ఇది వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు మేగ్‌సేఫ్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ 14 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ సామర్థ్యాన్ని కలిగి ఉండటమే కాకుండా.. రాబోయే iOS అప్‌డేట్‌లకు పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. తక్కువ ధరలో ప్రీమియం అనుభవం కావాలనుకునే వారికి ఈ డీల్ ఒక బెస్ట్ చాయిస్ అనిచెప్పుకోవచ్చు.