వ్యవసాయ అనుబంధ పరిశ్రమలతో ప్రగతి : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

వ్యవసాయ అనుబంధ పరిశ్రమలతో ప్రగతి :  ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

రేగొండ, వెలుగు: వ్యవసాయ అనుంబంధ పరిశ్రమలతో గ్రామాలు ప్రగతి పథంలో ముందుకు వెళ్తాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. గురువారం రేగొండ మండలం భాగిర్థిపేటలో కొత్తగా నిర్మాణం పూర్తి అయిన రైస్​మిల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరావు మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ పాడిపరిశ్రమ, మిల్లింగ్ వ్యాపారంతో స్థానికంగా ఉండే రైతులకు రవాణా ఖర్చుల భారం తగ్గడంతో పాటు కూలీలకు ఉపాధి దొరుకుతుందన్నారు. 

ఈ పరిశ్రమలకు ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తుందన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్​ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రెండేళ్ల కాలంలో అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. నాయకులు గూటోజు కిష్టయ్య, ఎండీ షబ్బిర్, నాయినేని సంపత్​రావు, నడిపెల్లి విజ్జన్​రావు, ఎర్రబెల్లి రవీందర్​రావు, పెండెల ఉపేందర్​ పాల్గొన్నారు.