కోల్కత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీల సంఖ్య: 220.
విభాగాల వారీగా ఖాళీలు: ట్రేండ్ అప్రెంటీస్ 120, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 40, టెక్నీషియన్ అప్రెంటీస్ 60.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత విభాగం, ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 14 నుంచి 26 ఏండ్ల మధ్యలో ఉండాలి .
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: 2026, జనవరి 10.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.grse.in/career వెబ్సైట్ను సందర్శించండి.
