చచ్చిపోతున్న సాఫ్ట్వేర్లు.. హైదరాబాద్ ఖైరతాబాద్లో.. ఎంత ఘోరం జరిగిందో చూడండి !

చచ్చిపోతున్న సాఫ్ట్వేర్లు.. హైదరాబాద్ ఖైరతాబాద్లో.. ఎంత ఘోరం జరిగిందో చూడండి !

హైదరాబాద్ సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. పని ఒత్తిడి తట్టుకోలేక మొన్న ఒకరు.. ఖైరతాబాద్ రైల్వే గేటు దగ్గర రైలు కింద పడి ఇవాళ మరొకరు. ఇలా ఐటీ ఉద్యోగుల బలవన్మరణాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఖైరతాబాద్ రైల్వే గేటు సమీపంలో ఓ యువకుడు రైలు పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. వరంగల్‌కు చెందిన తరుణ్ (28) ప్రాణాలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఖైరతాబాద్‌లో నివసిస్తూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు సమాచారం.

కేసు నమోదు చేసిన నాంపల్లి రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. మొన్నటికిమొన్న.. ఏపీలోని అమలాపురం తిలకుప్పకు చెందిన సతీశ్ (31) గచ్చిబౌలిలో ఉంటూ ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. సతీశ్ భార్య ఇటీవల సొంతూరికి వెళ్లగా, బుధవారం ఉరేసుకుని చనిపోయాడు. జాబ్లో ప్రెషర్ అవుతుందని సతీశ్ చెబుతుండేవాడని బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

కడప జిల్లా బద్వేల్​కు చెందిన ఎం. వెంకటేష్ (30) ఎంబీఏ పూర్తి చేశాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేసేందుకు సొంతూరు నుంచి బయలుదేరి ఈ నెల 3న మియాపూర్ చేరుకున్నాడు.  అదే రోజు ఉదయం మియాపూర్ బొమ్మరిల్లు దగ్గర గడ్డి మందు తాగి 108కు కాల్ చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఫిబ్రవరి 4న (బుధవారం) తెల్లవారుజామున మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులతోనే వెంకటేశ్ చనిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.