బాలీవుడ్ సినీ ప్రపంచాన్ని గ్యాంగ్ స్టర్ల నీడ భయబ్రాంతులకు గురిచేస్తోంది. లేటెస్ట్ గా స్టార్ హీరో రణవీర్ సింగ్ కు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. ఇటీవల దర్శకడు రోహిత్ శెట్టి ఇంటిపై జరిగిన కాల్పుల ఘటన మరవకముందే రణవీర్ ను లక్ష్యంగా చేసుకోసుకోవడంతో సినీ ప్రముఖుల్లో ఆందోళన నెలకొంది. ఈ బెదిరింపులు లారెన్స్ బిష్టోయ్ గ్యాంగ్ నుంచే రావడంతో మరింత కలకలం రేపుతోంది..
రంగంలోకి పోలీసులు!
తనకు బెదిరింపు నోట్ వచ్చిన వెంటనే రణవీర్ సింగ్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. సదరు సందేశంలో తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వారమని పంపిన వ్యక్తి పేర్కొన్నాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు రణవీర్ సింగ్, దీపికా పదుకొనే నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం ఆ వాయిస్ నోట్ ఎక్కడి నుండి వచ్చింది? పంపిన వ్యక్తి ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పుల సెగ
అంతకుముందు ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి జుహూ నివాసం వద్ద జనవరి 31, 2026 అర్ధరాత్రి దుండగులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపి కలకలం సృష్టించారు. ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అర్జు బిష్ణోయ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఆడియో మెసేజ్ విడుదల చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటికే లారెన్స్ బిష్టోయ్ గ్యాంగ్ తో సంబంధం ఉన్న ఐదుగురి అదుపులోకి తీసుకున్నారు. వారికి ఆయుధాలను సరఫరా చేసిన వ్యక్తిని పుణెలో అరెస్ట్ చేశారు.
►ALSO READ | Allu Arjun : కావేరి బారువా ఆరోపణల్లో నిజం లేదు.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమైన ఐకాన్ స్టార్ టీమ్!
వరుసగా బాలీవుడ్ ప్రముఖులపై గురి!
గతంలో సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకున్న బిష్ణోయ్ గ్యాంగ్, ఇప్పుడు రోహిత్ శెట్టి, రణవీర్ సింగ్ వంటి వారిని బెదిరించడం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలో మళ్లీ అండర్ వరల్డ్ కార్యకలాపాలు పెరుగుతున్నాయా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. వరుసగా సినీ ప్రముఖులకు బెదిరింపులు వస్తుండటంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర భయాందోళన నెలకొంది.
Bollywood actor Ranveer Singh receives threat on WhatsApp, security increased around his residence: Mumbai police pic.twitter.com/WA6VWts48J
— Press Trust of India (@PTI_News) February 10, 2026
