ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ఒక ప్రముఖ బ్రాండ్ స్ట్రాటజీ విభాగంలో పనిచేసినట్లు చెప్పుకుంటున్న కావేరి బారువా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఓ పాడ్ కాస్ట్ లో ఆమె మాట్లాడుతూ.. అల్లు అర్జున్ తో పనిచేయాలంటే కఠినమైన రూల్స్ ఉంటాయంటూ కామెంట్స్ చేసింది. గతంలో ఒక షూటింగ్ సందర్భంగా బన్నీ మేనేజర్స్ తమకు 42 నిబంధనలతో కూడిన ఒక లిస్ట్ ఇచ్చారని పేర్కొంది. సార్ కళ్లలోకి చూడకూడదు, ఆయనతో హ్యాండ్ షేక్ చేయకూడదు వంటి వింత కండిషన్లు అందులో ఉన్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి.
అల్లు అర్జున్ టీం వార్నింగ్
కావేరి బారువా చేసిన ఈ ఆరోపణలు వైరల్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. బన్నీ టీం వెంటనే రంగంలోకి దిగింది. లేటెస్ట్ గా ఆమె చేసిన ఈ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేస్తూ అధికారికంగా ప్రకటన రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ ఎప్పుడూ అత్యంత హుందాతో, గౌరవంతో ప్రవర్తిస్తారు. ఆయనపై వస్తున్న ఈ నిరాధారమైన వ్యాఖ్యలను మేము సీరియస్గా తీసుకుంటున్నాము. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై మా లీగల్ టీం డెఫమేషన్ దాఖలు చేస్తోంది అని స్పష్టం చేశారు. ఇలాంటి అవాస్తవాలను ఎవరూ నమ్మొద్దని కోరింది. ఇలాంటి ధృవీకరించని కంటెంటెను షేర్ చేయకుండా ఉండాలని అల్లు అర్జున్ టీం సూచించింది.
A recent video spreading baseless allegations about @alluarjun garu is completely false. The matter is being taken seriously and legal action is being initiated against those responsible. Kindly refrain from sharing unverified content. pic.twitter.com/HwHU7Ti51k
— Sarath Chandra Naidu (@imsarathchandra) February 10, 2026
పోస్ట్ డిలీజ్ చేసిన కావేరి..
బన్నీ టీం లీగల్ యాక్షన్ వార్నింగ్ ఇవ్వడంతో.. కావేరి బారువా తన లింక్డ్ఇన్ , ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను డిలీట్ చేశారు. అయితే, అప్పటికే ఆ పాడ్కాస్ట్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. నెటిజన్లు కూడా కళ్లలోకి చూడకూడదనే రూల్ ఏంటి?" అంటూ విమర్శలు గుప్పించగా, మరికొందరు ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేస్తున్నారు. అల్లు అర్జున్ ఇమేజ్ ని దెబ్బతీసేందుకు ఇలాంటి ఆసత్యపు ఆరోపణలు చేస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
Unbelievable rules of Allu Arjun.
— lakshman (@rebel_notout) February 10, 2026
A media professional reveals some of the shocking "do's and don'ts" when meeting megastar Allu Arjun.
From strictly following a list of 42 rules to being told "don't look in sir's eyes" and "don't shake hands,"
Why someone can't look in your… pic.twitter.com/pGv9UmhhBP
