మనం దిగితే రికార్డులు బద్దలవ్వాల్సిందే: లిస్ట్ ఏ క్రికెట్లో వార్నర్ రికార్డ్ సమం చేసిన రోహిత్

మనం దిగితే రికార్డులు బద్దలవ్వాల్సిందే: లిస్ట్ ఏ క్రికెట్లో వార్నర్ రికార్డ్ సమం చేసిన రోహిత్

ముంబై: టీమిండియా స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భీకర ఫామ్‎లో ఉన్నారు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పర్యటనల్లో దుమ్మురేపిన రోకో జోడీ దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కూడా అదే ఫామ్ కొనసాగిస్తున్నారు. చాలా ఏండ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతున్నప్పటికీ తొలి మ్యాచులోనే సెంచరీలతో చెలరేగి తమ తమ జట్లకు ఘన విజయాన్ని అందించారు. 

తన హోం టీం ఢిల్లీ తరుఫున బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ ఆంధ్రప్రదేశ్‎తో జరిగిన మ్యాచులో సెంచరీతో కదం తొక్కాడు. ఇక.. ముంబై నుంచి ఆడిన రోహిత్ శర్మ సిక్కింపై భారీ సెంచరీ బాదాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ వింటేజ్ హిట్ మ్యాన్‎ను గుర్తు చేశాడు. ఈ మ్యాచులో 155 పరుగులు చేయడం ద్వారా  రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించారు. 

►ALSO READ | కాకా క్రికెట్ టోర్నమెంట్: పెద్దపల్లి జిల్లాపై కరీంనగర్ జిల్లా గ్రాండ్ విక్టరీ

లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సార్లు 150+ స్కోర్ చేసిన ప్లేయర్‎గా ఆసీస్ దిగ్గజం డేవిడ్ వార్నర్(9) రికార్డును సమం చేశారు. అంతేకాకుండా విజయ్ హజారే ట్రోఫీలో శతకం బాదిన రెండో అతిపెద్ద వయస్కుడిగానూ (38y 238d) హిట్ మ్యాన్ నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ కంటే ముందు అనుస్తుప్ మజుందార్ ఉన్నారు. ఆయన 39 సంవత్సరాల వయసులో విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ కొట్టి.. ఈ టోర్నీ చరిత్రలో సెంచరీ కొట్టిన అతిపెద్ద వయస్కుడిగా కొనసాగుతున్నారు. రోహిత్ సెంచరీ చేయడంపై ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం దిగితే రికార్డులు బద్దలు అవ్వాల్సిందే అంటూ హిట్ మ్యాన్ ను ఆకానికెత్తుతున్నారు.