కాకతీయ కాల్వకు డిసెంబర్ 31న నీటి విడుదల

కాకతీయ కాల్వకు డిసెంబర్ 31న నీటి విడుదల

ఎల్కతుర్తి, వెలుగు: ఎస్సారెస్పీ పరిధిలోని లోయర్​ మానేర్​ డ్యాం నుంచి ఆయకట్టుకు యాసంగి సాగుకు నీటిని విడుదల చేయనున్నట్లు నీటిపారుదలశాఖ కరీంనగర్ సర్కిల్​-2 సూపరిండెంట్ పి.రమేశ్​ గురువారం తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు.

 146.00 కిలోమీటర్ల నుంచి 284.00 కు (జోన్--1) ఏడు రోజులకో సారి ఆన్, ఆఫ్, 284.09  కిలోమీటర్ల నుంచి 340.00 కు (జోన్--2)ఎనిమిది రోజులకో సారి నీటి విడుదల కొనసాగుతుందని, రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకొని సహకరించాలని సూచించారు.