తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా అని పిటిషన్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏమైనా ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వాలని పిటిషనర్ను ఆదేశించారు.
లడ్డూ వ్యవహారంపై మానూరు శ్రీనివాస్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ జరిపింది. విచారణ సందర్భంగా .. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా అని పిటిషన్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్. అన్ని పరిశీలించాకే సీబీఐ చేత సిట్ వేయించామని చెప్పారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏమైనా ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వాలని ఆదేశిస్తూ పిటిషన్ ను కొట్టివేశారు.
ఈ సందర్భంగా నెయ్యిలో క ల్తీ జరిగిందని చెబుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా పరిస్థితులు మారుతున్నాయని కోర్టుకు తెలిపారు పిటిషనర్ తరపు న్యాయవాది. పబ్లిక్ స్టేట్మెంట్స్ ను సీబీఐ ఆపలేక పోతుందని కోర్టుకు తెలిపారు. టిటిడి లడ్డు కల్తీ వ్యవహారంపై సీబీఐ విచారణ కొనసాగుతున్నందున ఏమైనా ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వాలని పిటిషనర్ ను ఆదేశిస్తూ శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది.
