BECILలో గ్రూప్ డీ పోస్టులు.. 8th క్లాస్ పాసైనా చాలు..రూ. 20 వేల నుంచి 40 వేల వరకు జీతం

 BECILలో గ్రూప్ డీ పోస్టులు.. 8th క్లాస్  పాసైనా చాలు..రూ. 20 వేల నుంచి 40 వేల వరకు జీతం

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా  లిమిటెడ్ (బీఈసీఐఎల్) డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఫుడ్ బేరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 2026, జనవరి 02. 

ALSO READ : బీటెక్ లేదా BSC పాసైతే చాలు.. 

పోస్టుల సంఖ్య: 78. 
విభాగాల వారీగా ఖాళీలు: టెక్నికల్ అసిస్టెంట్ 01, ఆప్తాల్మిక్ టెక్నీషియన్ 03, పేషెంట్ కేర్ మేనేజర్ (పీసీఎం) 05, పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ (పీసీసీ) 01, అసిస్టెంట్ డైటీషియన్ 02, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ (ఎంఆర్​టీ) 03, డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్స్ 30, టైలర్ 01, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్ టీ) 05, ల్యాబ్ అటెండెంట్ 01, డెంటల్ టెక్నీషియన్ 02, పీటీఐ– మహిళ 01, రేడియోగ్రాఫర్ 01, డేటా ఎంట్రీ ఆపరేటర్(డీఈఓ) 10, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)– పురుషులు 10, ఫుడ్ బేరర్ 02. 
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, బీఎస్సీ, డిప్లొమా, 12వ తరగతి, ఐటీఐ, పదో తరగతి, ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
వయోపరిమితి: 18 నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 22.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.295.
లాస్ట్ డేట్: 2026, జనవరి 02. 
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, ఇంటర్వ్యూ/ అసెస్ మెంట్/ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.becil.com 
వెబ్​సైట్​ను సందర్శించండి.