హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటగిరిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పాదచారి పైకి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి ఘటనా స్థలంలోన ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వ్యక్తి నాని కిచెన్ లో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు.
రోడ్డు ప్రమాదంతో వెంకటగిరిలో కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
