నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లాలో ‘సర్’ పారదర్శకంగా నిర్వహించాలి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని

నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లాలో ‘సర్’ పారదర్శకంగా నిర్వహించాలి :   రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని

నాగర్ కర్నూల్ టౌన్/కొల్లాపూర్/అచ్చంపేట, వెలుగు :  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్న ఆమెకు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ సవరణ (సర్) ప్రక్రియ పురోగతిని ఆమె సమీక్షించారు. ఓటరు జాబితాల నవీకరణ, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, మరణించిన ఓటర్ల వివరాల తొలగింపు వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

సర్​ కార్యక్రమాన్ని నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఆమె సూచించారు. బూత్ స్థాయి అధికారుల పనితీరు, దరఖాస్తుల పరిశీలన మరియు జిల్లాలో తీసుకుంటున్న పరిపాలనా చర్యలను కలెక్టర్ ఆమెకు వివరించారు. అనంతరం ఆమె సోమశిల సంగమేశ్వరుని దర్శించుకుని, మల్లేశ్వరం ఐలాండ్ పనులు, సోమశిల–సిద్ధేశ్వరం తీగల వంతెన, ఇతర పర్యాటక అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అచ్చంపేట మండలం రంగాపురం గ్రామంలోని శ్రీశైల ఉత్తర ద్వారమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వర స్వామి దేవస్థానాన్ని కూడా ఆమె దర్శించుకున్నారు. ఆలయ చరిత్ర, విశిష్టత గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు.