GHMC వార్డుల డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్

GHMC వార్డుల డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వార్డుల డీలిమిటేషన్‎కు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ విడుదలైంది. 300 వార్డులతో తుది నోటిఫికేషన్‏ను గురువారం (డిసెంబర్ 25) ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీంతో జీహెచ్ఎంసీలో జోన్లు, సర్కిల్స్ పెరిగాయి. ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లు 12 కాగా.. 30 సర్కిల్స్ 60కి పెరిగాయి. 

కాగా, ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు,7  కార్పొరేషన్లను ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విలీనం చేసిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా జీహెచ్ఎంసీలో డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కి పెంచింది. ఈ మేరకు 2025, డిసెంబర్ 9న ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం డివిజన్ల విభజనపై ప్రజల నుంచి 10 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించింది. డివిజన్ల విభజనపై 6 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయి. అభ్యంతరాలను పరిశీలించిన అధికారులు సహేతుకమైన వాటిని పరిగణలోకి తీసుకుని ఫైనల్ నోటిఫికేషన్‎ను విడుదల చేశారు.