- అంధుల పాఠశాలలో వృద్ధులకు పండ్లు పంపిణీ
కోల్ బెల్ట్: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బర్త్ డే వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిం చారు. మంచిర్యాల జిల్లా మందమర్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బీ1 వద్ద పార్టీ నాయకులు, యూత్ లీడర్ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తాత కాకా వెంకటస్వామి స్ఫూర్తితో తండ్రి రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆశ యాలకు అనుగుణంగా పేదల సంక్షేమమే ధ్యేయంగా, నిరుద్యోగ యువతకు ఉపాధికల్పన లక్ష్యంగా ఎంపీ వంశీకృష్ణ కృషి చేస్తున్నారనిచెప్పారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు.
వృద్ధులకు అన్నదానం
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బర్త్ డే సందర్భంగా యూత్ కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా సెక్రెటరీ, ఐఎస్టియూసీ శ్రీరాంపూర్ ఏరియా సెక్రటరీ తోకల సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ రాంపూర్ లోని సాయి. దృష్టి అందుల పాఠశాలలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడంతో అన్నదానం ఏర్పాటు చేశారు.
భీమారంలో..
భీమారం మండల కేంద్రంలోని క్రికెట్ గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఉష్యమల్ల పున్నం చందు, యువత ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ జన్మదిన వేడుకలను నిర్వహించారు.
