హీరోయిన్స్ వస్త్రాదారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారలేదు. ఒకవైపు విమర్శలు, మరోవైపు సమర్థనలతో ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. లేటెస్ట్ గా ఈ వివాదంలోకి బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి, ఆమె భర్త, రాజకీయ నేత దువ్వాడ శ్రీనివాస్ ఏంట్రీ అయ్యారు. అనసూయ భరద్వాజ్‌పై వీరు సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అసలు వివాదం ఏమిటి?
'దండోరా' చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ.. హీరోయిన్ల వస్త్రధారణపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సామాన్లు, దొంగము** అంటూ ఆయన వాడిన పదజాలం తీవ్ర దుమారం రేపింది. దీనిపై సింగర్ చిన్మయి, నటి అనసూయ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను, వస్త్రధారణను విమర్శించే హక్కు శివాజీకి ఎక్కడిదని వారు ప్రశ్నించారు.
అనసూయపై దివ్వెల మాధురి ఫైర్!
ఈ వివాదంపై జరిగిన ఒక టీవీ చర్చలో దివ్వెల మాధురి ఘాటుగా స్పందించారు. శివాజీ వాడిన పదాలు తప్పు కావొచ్చు కానీ, ఆయన వెనుక ఉన్న ఉద్దేశం సరైనదేనని ఆమె చెప్పుకొచ్చారు. శివాజీ మాట్లాడిన విధానం, ఉపయోగించిన కొన్ని పదాలు ఖచ్చితంగా తప్పే. కానీ ఆయన చెప్పాలనుకున్న పాయింట్లో నిజం ఉంది. ఇప్పటికే ఆయన క్షమాపణలు చెప్పారు కాబట్టి, ఇక ఆ విషయాన్ని వదిలేయాలి. కానీ అనసూయ మాత్రం దీనిని పట్టుకుని అనవసరంగా అతి చేస్తోంది అని మాధురి విమర్శించారు.
ALSO READ : బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్'గర్జన ..
శివాజీకి మద్దుగా దువ్వాడ శ్రీనివాస్
స్త్రీకి చీరకట్టులోనే అసలైన అందం ఉంటుందని, నేటి తరం హీరోయిన్లు మితిమీరిన పొట్టి బట్టలు వేసుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఎవరి ఇష్టం వాళ్లది అంటే.. నచ్చిన వాళ్లను బట్టలు విప్పుకుని తిరగమనండి, అంతకంటే ఎక్కువ అనసూయ గురించి మాట్లాడలేం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ చర్చలో పాల్గొన్న దువ్వాడ శ్రీనివాస్ కూడా శివాజీకి మద్దతుగా నిలిచారు. హీరోయిన్లు కేవలం డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చెప్పినట్లే బట్టలు వేసుకుంటారని, కాబట్టి ఆ మార్పు మేకర్స్ నుంచి రావాలని ఆయన సూచించారు. సమాజంలో మహిళా గౌరవం పెరగాలంటే వస్త్రధారణ పద్ధతిగా ఉండాలనేది వారి వాదన.
ముదురుతున్న 'వస్త్రధారణ' పోరు
శివాజీ వ్యాఖ్యలను సమర్థించే వారు ఒక వర్గంగా, వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని కోరే వారు మరో వర్గంగా విడిపోయారు. తప్పుగా మాట్లాడానని శివాజీ ఒప్పుకున్నాక కూడా అనసూయ రచ్చ చేయడం ఎందుకు? అని మాధురి ప్రశ్నిస్తుంటే.. పద్ధతిగా ఉండాలని చెప్పడానికి అసభ్య పదజాలం వాడటమేనా సంస్కారం? అని నెటిజన్లు నిలదీస్తున్నారు.
మొత్తానికి, శివాజీ వ్యాఖ్యల చుట్టూ మొదలైన ఈ రగడ.. ఇప్పుడు అనసూయ వర్సెస్ దివ్వెల మాధురిగా మారే అవకాశం ఉంది. మాధురి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
