మున్సిపల్ ఎన్నికల చెకింగ్... గోషామహల్ లో భారీగా డబ్బు పట్టివేత

మున్సిపల్ ఎన్నికల చెకింగ్... గోషామహల్ లో  భారీగా డబ్బు పట్టివేత

హైదరాబాద్  గోషామహల్లో భారీగా  డబ్బు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  ఫిబ్రవరి 10న  గోషామహల్ లో పోలీసులు  తనిఖీలు చేస్తుండగా..ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు  ఎలాంటి పత్రాలు లేకుండా రూ. 76. 87 లక్షలు తరలిస్తుండగా పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకుండా నగదు తరలిస్తున్న ముగ్గురుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.  స్వాధీనం చేసుకున్న డబ్బును ఇన్ కమ్  ట్యాక్స్ కు అప్పగించనున్నారు పోలీసులు.

రాష్ట్రంలో ఫిబ్రవరి 11న మున్సిపల ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం,డబ్బు పంపిణీ చేస్తున్నారు.  పట్టణాల్లో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంది. భారీగా డబ్బు పట్టుబడుతోంది. ఈ క్రమంలో  హైదరాబాద్ సిటీ గోషామహల్ లో దాదాపు 77 లక్షలు పట్టుబడటం కలకలం రేపుతోంది.  ఓటర్లకు పంపిణీ చేసేందుకు హైదరాబాద్ నుంచి జిల్లాలకు డబ్బును సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఎవరికి అనుమానం రాకుండా ద్విచక్రవాహనంపై డబ్బును తరలిస్తున్నారు. 

పోలీసులు స్వాధీనం చేసుకున్న 76 లక్షలు హవాలా డబ్బా? లేక మున్సిపల్ ఎన్నికల్లో పంపిణీకి తీసుకెళ్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.