బషీర్‌బాగ్, వెలుగు: విద్యాభివృద్ధికి నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఎంతో కృషి చేస్తున్నదని సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సోమవారం నిర్వహించిన ‘సుర్ స్టార్’ గీతాలాపన కార్యక్రమం విన్నర్అన్మోల్ మోహన్‌కు రూ.లక్ష, రన్నర్ కృష్ణన్ ఈశ్వరికి రూ. 50 వేల నగదు పురస్కారం అందజేశారు.
45 రోజుల నుమాయిష్ఎగ్జిబిషన్లో సందర్శకుల కోసం వినోదాత్మక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సొసైటీ ఉపాధ్యక్షుడు ఆర్. సుఖేశ్ రెడ్డి, కార్యదర్శి బి.ఎన్. రాజేశ్వర్, సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
