శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శివ స్వాములలో శ్రీశైల పుణ్య క్షేత్రం కిటకిటాడుతుంది. దేవస్థాన అధికారులు భక్తులకు కనీస సౌకర్యాలు కలుగజేయడంలో విఫలమయ్యారు. మల్లన్న భక్తులపై పోలీసులు లాఠీ చేశారు.
కఠిన దీక్షతో.. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులను అదుపుచేయలేక పోలీసులు లాఠీ చార్జ్ చేయడంపై ఏపీ బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ సీరియస్ అయ్యారు. ఎడిషినల్ ఎస్పీ భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని ఆయన తప్పు పట్టారు.
శైవ భక్తులు పట్ల సంయమనం పాటించాలని అధికారులు కు హితవు పలికారు. మాల ధారణ చేసి న భక్తులు శ్రీశైలం లో ఇరుముడులు సమర్పిస్తారు.వారికి సహకరించాల్సిన యంత్రాంగం సంయమనం కోల్పోతే ఎలా అని మాధవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శ్రీ శైలం దేవాలయం పాలకమండలి తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
