మహాశివరాత్రి వాల్ పోస్టర్ ఆవిష్కరణ 

మహాశివరాత్రి వాల్ పోస్టర్ ఆవిష్కరణ 

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: మహాశివరాత్రి సందర్భంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ లో జరిగే కల్యాణ, జాగరణ మహోత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను మంత్రి సీతక్క సోమవారం క్యాంప్​ ఆఫీస్​లో ఆవిష్కరించారు. మహాశివరాత్రి రోజు నుంచి మూడు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకలకు సంబంధించి ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్ మంత్రికి వివరించారు.

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా మంత్రి సీతక్క వాల్ పోస్టర్​ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, లక్ష్మీదేవిపేట సర్పంచ్ బొమ్మ కంటి వంశావతి రమేశ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.