న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ ఎలా చేసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారా..? మరేం తప్పులేదు. పర్మిషన్ తీసుకుని.. డ్రగ్స్ వగైరా మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఎంజాయ్ చేయడ పోలీసులకు అభ్యంతరం లేదు. కానీ తాగి బండినడిపితేనే అసలు సమస్య. డిసెంబర్ 31వ రోజు విచ్చలవిడిగా తాగి బండి నడిపే వారికోసం సాయంత్రం నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నట్లు చెప్పారు సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ తేజవత్ రామదాసు.
హైదరాబాద్ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతోందన్నారు డీసీపీ. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 28 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. డిసెంబర్ 24 నుండి 30 వరకుడ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి ఒంటిగంట వరకు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయన్నారు.
►ALSO READ | హైదరాబాద్ పబ్లిక్కు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ రోజు అర్ధరాత్రి వరకూ MMTS స్పెషల్ ట్రైన్స్
అయితే డిసెంబర్ 31న మాత్రం ప్రత్యేక ఫోకస్ ఉంటుందన్నారు. సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లు చేపట్టాలని నిర్ణయించిట్లు తెలిపారు. హైదరాబాద్ సిటీ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సాధారణ ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
