హైదరాబాద్: కొత్త సంవత్సరం సందర్భంగా 2026 జనవరి 1న తెల్లవారుజామున హైదరాబాద్ సిటీలో MMTS స్పెషల్ ట్రైన్స్ నడపాలని దక్షిణ మధ్య నిర్ణయించింది. ఒక MMTS స్పెషల్ ట్రైన్.. లింగంపల్లి నుంచి జనవరి 1న అర్ధరాత్రి 1:15 గంటలకు బయలుదేరి 1:55 గంటలకు నాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది.
ఈ ట్రైన్.. చందానగర్, హఫీజ్‌పేట్, హైటెక్ సిటీ, బోరబండ, భరత్ నగర్, బేగంపేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ సహా పలు కీలక రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. అదే రోజు 1:30 గంటలకు లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వరకూ మరో ప్రత్యేక MMTS ట్రైన్ కూడా నడుస్తుంది.
న్యూ ఇయర్ కారణంగా రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ప్రజలను గమ్య స్థానాలకు చేర్చడానికి ఈ స్పెషల్ ట్రైన్స్ను నడపాలని రైల్వే నిర్ణయించింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా.. అర్ధరాత్రి వేళల్లో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.
►ALSO READ | బంపర్ ఆఫర్: సగం ధరకే ఐఫోన్ 14.. ఎక్కడో తెలుసా?
హైదరాబాద్ సిటీలో బుధవారం నుంచి జనవరి 1 వరకు డ్రంకెన్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఇప్పటికే స్పష్టం చేశారు. న్యూ ఇయర్ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
