బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

నిర్మల్  జిల్లా  బాసర ట్రిపుల్ ఐటిలో విషాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతోన్న వసంత  హాస్టల్  గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. సిబ్బంది సమాచారంతో  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని  భైంసా అసుపత్రికి తరలించారు. 

మృతురాలు  వనపర్తి జిల్లాకు చెందిన వసంతగా గుర్తించారు పోలీసులు. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు.   బైంసా ఆసుపత్రి ముందు భారీ  బందోబస్తు ఏర్పాటు చేశారు  పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారాణాలపై ఆరాదీస్తున్నారు. తోటి విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నారు.