తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన పవిత్ర వస్త్రాలను టీటీడీ ఈ-వేలం వేయనుంది. మార్చి 02 నుంచి ఆన్‌లైన్‌లో ఈ వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది.వివిధ రకాల వస్త్రాల లాట్లను కొనుగోలు చేయడానికి భక్తులు వెబ్‌సైట్ ద్వారా పాల్గొనవచ్చు.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలు కొత్తవి,ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్నవి మొత్తం 287 లాట్ల ఆర్ట్ సిల్క్ చీరలు, హాఫ్ సారీస్, సిల్క్ చీరలు ,ఆర్డినరీ చీరలను వేలం వేయనున్నారు. మార్చి 02నుంచి మార్చి 09 వ తేదీ వరకు ఈ-వేలం ప్రక్రియ కొనసాగుతుంది.
ఆన్ లైన్ వేలంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ - కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన బిడ్డర్లు అర్హులు. వస్త్రాల ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్, ఏఈవో , టిటిడి, హరేకృష్ణ మార్గ్, తిరుపతిలో సంప్రదించాలి. https://konugolu.ap.gov.in లేదా టిటిడి వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877-2264429 / 9959988470 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించగలరు.
