విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న వివాహ వేడుకకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 24 గంటల్లో ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటవనున్నారు. ఇప్పటికే రాజస్థాన్‌లోని చారిత్రక నగరం ఉదయ్‌పూర్‌లో ఉన్న ‘మెమెంటోస్ బై ఐటిసి హోటల్స్’ వైభవంగా ముస్తాబైంది. రేపు గురువారం ఫిబ్రవరి 26న జరగబోయే ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం సినీ స్టార్స్ తరలివస్తున్నారు. ఈ సందర్భంగా విజయ్ ఫ్రెండ్ అయిన డైరెక్టర్ కం యాక్టర్ తరుణ్ భాస్కర్ ఉదయ్ పూర్కి చేరుకున్నారు.
అయితే, ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. రూమర్స్ లవర్స్గా వైరల్ అవుతున్న తరుణ్ భాస్కర్- హీరోయిన్ ఈషా రెబ్బా కలిసే వెళ్లారు. వీరిద్దరూ ఉదయ్ పూర్ ఎయిర్ పోర్ట్లో ల్యాండ్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ క్రమంలో ‘త్వరలో పెళ్లిపీటలెక్కబోయే “తరుణ్-ఈషా”.. ఇపుడు లవ్లీ కపుల్స్ విజయ్-రష్మీకల వివాహానికి విచ్చేసారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ : విజయ్–రష్మిక జంటకు ప్రధాని మోడీ విషెస్.. ప్రత్యేక లేఖ వైరల్!
అలాగే, వీరితో పాటుగా స్టైలిస్ట్ శ్రావ్య వర్మ కూడా వెళ్లారు. ఇపుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నివేదికల ప్రకారం, ఈ వివాహ వేడుకకు కేవలం 100 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దర్శకులు తరుణ్ భాస్కర్తో పాటుగా సందీప్ రెడ్డి వంగా, రాహుల్ రవీంద్రన్, శివ నిర్వాణ వంటి సినీ ప్రముఖులు ఆహ్వానితులలో జాబితాలో ఉన్నారని సమాచారం.
తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా పెళ్లి?
టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా ఈ జంట పేరు తెగ మార్మోగుతోంది. తరుణ్ భాస్కర్,ఈషా రెబ్బ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా షికారు చేస్తున్నాయి. ఇటీవలే 'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీ ప్రమోషన్స్‌లో వీరిద్దరూ స్పందించిన తీరు ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చింది.
ఈషా రెబ్బా రియాక్షన్..
మూవీ ప్రమోషన్స్‌లో ఈషా రెబ్బాకు డేటింగ్ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె చాలా చాకచక్యంగా సమాధానమిచ్చింది. "ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండటం మంచిదే కదా! ప్రస్తుతానికి దేనిపైనా క్లారిటీ ఇవ్వదల్చుకోలేదు. ఒకవేళ నా జీవితంలో ఏదైనా విశేషం ఉంటే నేనే స్వయంగా అందరికీ చెబుతాను" అని వెల్లడించింది. ఈ ముద్దుగుమ్మ ఈ ప్రేమ ముచ్చటను మాత్రం ఖండించకుండా సమాధానం దాటమేసింది..
తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే?
ఈషా కంటే ఒక అడుగు ముందుకు వేసిన తరుణ్ భాస్కర్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పారు. "ఆమె నాకు ఒక స్నేహితురాలి కంటే ఎక్కువ " అని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది నా వ్యక్తిగత విషయం. ఏదైనా చెప్పేటప్పుడు అది ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని నేను భావిస్తాను. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే మీ అందరికీ ఒక 'గుడ్ న్యూస్' చెబుతాను అని హింట్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య 'సమ్‌థింగ్ సమ్‌థింగ్' కాదు, సీరియస్ రిలేషనే ఉందని నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు.
