యూట్యూబర్ కోమలి ఇంటికి అఖిల్ ఎందుకెళ్లాడు.. ఆత్మహత్య ముందు రోజు ఏం జరిగింది..!

యూట్యూబర్ కోమలి ఇంటికి అఖిల్ ఎందుకెళ్లాడు.. ఆత్మహత్య ముందు రోజు ఏం జరిగింది..!

హైదరాబాద్ లోని మణికొండలో  యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారాలే ఆమె ఆత్మహత్యకు కారణమని తెలుస్తున్నప్పటకీ అసలేం జరిగిందనేది ప్రశ్నార్థకంగా మారింది.

లేటెస్ట్ గా  ఆత్మహత్యకు ముందు రోజు కోమలి ఇంటికి  అఖిల్ రెడ్డి వచ్చి వెళ్లినట్లు సీసీటీవీలో  రికార్డ్ అయ్యింది.  అఖిల్, కోమలికి ఏడాది క్రితం బ్రేక్ అప్ అవ్వగా అతనిని వదిలి ఉండలేక తనకు కాల్ చేసి ఇంటికి పిలిచినట్లు తెలుస్తోంది.  తనతో కలిసి ఉండాలని కోమలి కోరగా నిరాకరించిన అఖిల్  అక్కడి నుంచి వెళ్లిపోయిందని సమాచారం.  దీంతో మనస్తాపానికి గురైన  కోమలి గదిలో ఫ్యాన్ కు ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. 

మణికొండ చిత్రపురి కాలనీకి చెందిన కోమలి బోను(21) మల్లారెడ్డి వర్సిటీలో బీఎస్సీ చదువుకుంటూనే మరోవైపు వీడియోలు చేస్తూ యూట్యూబర్​గా గుర్తింపు తెచ్చుకుంది. సాప్ట్​వేర్ ఉద్యోగం చేసే మరో యూట్యూబర్ అఖిల్ రెడ్డితో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మూడేండ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ ఏడాది కింద మనస్పర్థల వల్ల విడిపోయారు.

అయితే అఖిల్​ను మర్చిపోలేక కోమలి తీవ్ర మనోవేదనకు గురై గతంలోనూ ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు అడ్డుకొని కాపాడారు. కాగా, రెండు రోజుల కింద కోమలి మళ్లీ అఖిల్ రెడ్డికి ఫోన్ చేయగా, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఫిబ్రవరి23  అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు చీరతో ఉరేసుకొని మృతి చెందింది. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.