తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన మిజోరం స్పీకర్

తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన మిజోరం స్పీకర్

హైదరాబాద్, వెలుగు: మిజోరం శాసనసభ స్పీకర్ పూలాల్ బిక్జామా, ఆయన భార్య వాన్‌ లాల్ రుటి మంగళవారం రాష్ట్ర అసెంబ్లీని సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారికి మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం శాసన సభాపతి చాంబర్‌లో ఇరు రాష్ట్రాల స్పీకర్లు సమావేశమయ్యారు.

ఈ భేటీలో రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరు, అవలంభిస్తున్న విధానాలు, శాసనసభ పనితీరుపై ప్రధానంగా చర్చించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో అమలువుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి మిజోరం స్పీకర్‌కు గడ్డం ప్రసాద్ సమగ్రంగా వివరించారు. సమావేశం ముగిసిన తర్వాత మిజోరం స్పీకర్ దంపతులను స్పీకర్ గడ్డం ప్రసాద్ శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.