మోదీ సర్కార్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది: ఎంపీ చామల

మోదీ సర్కార్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది: ఎంపీ చామల

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని విపక్ష పార్టీల ఎంపీలను ఎన్డీయేలోకి ఫిరాయించేలా ప్రొత్సహిస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

టీఎంసీ,శివసేన ఉద్ధవ్ థాక్రే,ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలను కొనుగోలు చేస్తూ బీజేపీ ఫిరాయింపులకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఈ ఫిరాయింపుల వ్యవహారంపై  చర్చించాలని లోక్  స్పీకర్ కు వాయిదా తీర్మాణం సమర్పించినట్లు తెలిపారు. ఈ బీజేపీ ఫిరాయింపులపై పార్లమెంట్ లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.