వందేమాతరం సాంగ్ వివాదం.. ప్రభుత్వం ఉత్తర్వుపై కర్నాటక హైకోర్టులో పిటిషన్

వందేమాతరం సాంగ్ వివాదం.. ప్రభుత్వం ఉత్తర్వుపై కర్నాటక హైకోర్టులో పిటిషన్

కర్ణాటకలో అధికారిక కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ గీతంలోని ఎన్ని చరణాలు ఆలపించాలనే అంశం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ,గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాలను మినహాయించి, మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో  ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ  హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్ వాదించారు. అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం పూర్తి అధికారిక రూపాన్ని పాటించాలని కేంద్రం సూచించిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు చరణాలకే పరిమితం చేయడం చట్టపరంగా చెల్లదని అన్నారు.ఈ నిర్ణయం తీసుకునే ప్రక్రియలో కేబినెట్ నోట్, న్యాయశాఖ సలహా వంటి అవసరమైన విధానాలను పాటించలేదని పిటిషనర్ ఆరోపించారు.
సెప్టెంబర్ 10 కర్నాటక ప్రభుత్వం వందేమాతరం స్టాంజాపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ కార్యక్రమాల్లో మాత్రమే అన్ని చరణాలు పాడాలని,  మిగతా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో రెండు చరణాలు మాత్రమే పాడాలని, కేంద్ర హోం శాఖజారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా ఉత్తర్వులు జారీ చేసింది. 

అయితే ప్రభుత్వ ఉత్తర్వులపై న్యాయవాది గిరీష్ భరద్వాజ్, న్యాయవాది అంగద్ కామత్ ద్వారా మంగళవారం ( సెప్టెంబర్ 15) న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు గానీ మరుసటి రోజుగానీ పిటిషన్ విచారణకు లిస్టు అయ్యే  అవకాశం ఉంది. 

ALSO READ : నానక్‌రామ్‌గూడ భూ వివాదం.. అల్లు అర్జున్ మామపై పోలీసులకు ఫిర్యాదు

ఇదిలా ఉంటే.. ఈ పిటిష్‌పై కర్ణాటక హైకోర్టు ఇంకా తుది నిర్ణయం వెలువరించలేదు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల చట్టబద్ధతపై తదుపరి విచారణలో కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వందేమాతరం చరణాలపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు కొనసాగుతాయా అనేది కోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంది.