పంతాలకు పోవద్దు..ప్రమోషన్లు కోల్పోవద్దు..డీఎస్పీలకు డీజీపీ సూచన

పంతాలకు పోవద్దు..ప్రమోషన్లు కోల్పోవద్దు..డీఎస్పీలకు  డీజీపీ  సూచన

పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దంటూ తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ డీఎస్పీలకు హితవు పలికారు. కోర్టు కేసుల కారణంగా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ల అంశంపై డీజీపీ పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

కోర్టు కేసులతో ప్రమోషన్లకు బ్రేక్ పడుతోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. 1991, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన 37 మంది డీఎస్పీలకు ఏఎస్పీలుగా తక్షణమే పదోన్నతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 37 ఏఎస్పీ ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని తెలిపారు.

డీఎస్పీల సమస్యల పరిష్కారానికి తానే స్వయంగా ముందుంటానని, అవసరమైతే ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని డీజీపీ భరోసా ఇచ్చారు. కోర్టు కేసులు ఉపసంహరించుకుంటే ప్రమోషన్లు వేగవంతం అవుతాయని స్పష్టం చేస్తూ.. ఈ నిర్ణయం కోసం అధికారులకు వారం రోజుల సమయం ఇస్తున్నట్లు తెలిపారు.

ALSO READ : హైదరాబాద్ లో ట్రాఫిక్‌కు చెక్..

డీజీపీ చొరవతో స్పందించిన వరంగల్ జోన్, హైదరాబాద్ సిటీకి చెందిన అధికారులు సైతం కేసులు ఉపసంహరించుకునేందుకు సుముఖత వ్యక్తంచేశారు. మొత్తానికి, డీజీపీ సీవీ ఆనంద్ చొరవతో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ల సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించేలా కనిపిస్తోంది.