భూపాలపల్లి ఏరియా ఓసీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. గనుల్లోకి చేరిన వర్షపు నీరు

భూపాలపల్లి ఏరియా ఓసీల్లో నిలిచిన  బొగ్గు ఉత్పత్తి.. గనుల్లోకి చేరిన వర్షపు నీరు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపాయి. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓసీ–1, కేటీకే ఓసీ–2, తాడిచర్ల ఓపెన్‌‌కాస్ట్ గనుల్లోకి వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఒక్కరోజులో సుమారు 90 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సింగరేణికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ఇక కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం 16,620 క్యూసెక్కులుగా నమోదైనట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు ఎత్తివేయడంతో నీటి ప్రవాహం దిగువకు కొనసాగుతోందని తెలిపారు.