సీజేపీ నిరసనలో గాయపడిన యువతి పరిస్థితి విషమం

సీజేపీ నిరసనలో గాయపడిన యువతి పరిస్థితి విషమం

రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వైద్యులతో నడ్డా సమావేశం
బాధితురాలిని పరామర్శించిన రాహుల్ గాంధీ, కేజ్రీవాల్
మా మద్దతుదారులందరికీ క్షమాపణలు చెబుతున్నా: దీప్కే


న్యూఢిల్లీ: ఢిల్లీలో సోమవారం జరిగిన సీజేపీ నిరసనలో గాయపడిన యువతి(20) పరిస్థితి చాలా విషమంగా ఉందని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి(ఆర్ఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్) వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోందని తెలిపారు. గాయపడిన వారిలో  యువతి పరిస్థితే అత్యంత ఆందోళనకరంగా ఉందని చెప్పారు.

సీజేపీ ఆధ్వర్యంలో  ఆందోళన చేపట్టిన స్టూడెంట్లపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, నిర్బంధ చర్యల్లో యువతి తీవ్రంగా గాయపడింది. ప్రమాదకర స్థితిలో ఉన్న ఆమెను వెంటనే ఢిల్లీలోని ఆర్ఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ ఆసుపత్రికి తరలించారు. లాఠీఛార్జ్ లో యువతి గాయపడటంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందిస్తూ.. నిరసనకారులకు, ముఖ్యంగా పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న మహిళా విద్యార్థులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆర్ఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన విద్యార్థులను పరామర్శించారు.

‘ సీజేపీ మద్దతుదారులందరికీ, ముఖ్యంగా పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న అమ్మాయిలకు నేను క్షమాపణలు చెబుతున్నాను. పరిస్థితిని మేం మరింత మెరుగ్గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది. మేం బాధ్యతాయుతంగా ప్రవర్తించి మిమ్మల్ని కాపాడుకోవాల్సింది. 20 మందికి పైగా విద్యార్థుల చావుకు కారణమైన ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాపాడటానికి, ప్రభుత్వం యువ విద్యార్థుల రక్తాన్ని చిందించడానికి కూడా వెనకాడట్లేదు. ఇంకా ఎంత మందినైనా గాయపరిచేందుకు సిద్ధంగా ఉంది’ అని పేర్కొన్నారు. గాయపడినవారు వ్యక్తిగతంగా తనను సంప్రదించాలని కోరారు.

ఆర్ఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ ఆస్పత్రికి నేతల క్యూ

గాయపడిన విద్యార్థులను పరామర్శించేందుకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆర్ఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. " ఆర్ఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఒక విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన మిగతా విద్యార్థులు, పోలీసు సిబ్బంది అందరూ డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా 110 మంది గాయపడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది" అని తెలిపారు.

లోక్ సభ ప్రతిపక్ష నేతరాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఆస్పత్రికి వెళ్లి గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా మంగళవారం ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్లారు. విద్యార్థులకు అందిస్తున్న అత్యవసర వైద్య సేవలు, ఐసీయూలో ఉన్న యువతి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆసుపత్రి వైద్యుల బృందంతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమీక్షించారు.