కరీంనగర్: రెండు మిల్లుల్లో 5,700 మెట్రిక్ టన్నుల వడ్లు మాయం

కరీంనగర్: రెండు మిల్లుల్లో 5,700  మెట్రిక్ టన్నుల వడ్లు మాయం
  •     విజిలెన్స్ తనిఖీల్లో వెలుగులోకి.. క్రిమినల్ కేసుకు నమోదుకు సిఫార్సు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా జమ్మికుంట, హుజురాబాద్ లోని రెండు  రైస్ మిల్లుల్లో రూ.11.50 కోట్ల విలువైన 5,700  మెట్రిక్ టన్నుల వడ్లు మాయమయ్యాయి. విజిలెన్స్ అధికారులు సోమవారం నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. హుజురాబాద్ లోని శ్రీసాయి ట్రేడర్స్ (జగన్మాత రైస్ మిల్లు)లో సోదాలు నిర్వహించగా మిల్లు అంతా ఖాళీగా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. 

ఇందులో సుమారు 3 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. దీంతో  మిల్లు నిర్వాహకుడిపై క్రిమినల్ కేసు నమోదుకు విజిలెన్స్ అధికారులు సిఫార్సు చేసినట్లు తెలిసింది. జమ్మికుంటలోని సప్తగిరి రైస్ మిల్లులో టెండర్ వడ్లు, సీఎంఆర్ వడ్లు కలిపి 2700 మెట్రిక్ టన్నులు మాయమైనట్లు గుర్తించారు. ఈ మిల్లుపైనా క్రిమినల్ కేసుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.