ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారం..కార్మికులకు, ఉద్యోగస్తులకు కనీస వేతనాలు అందిస్తాం

ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారం..కార్మికులకు, ఉద్యోగస్తులకు  కనీస వేతనాలు అందిస్తాం
  • ఐఎన్​టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి.సంజీవరెడ్డి

ముషీరాబాద్, వెలుగు: ఐక్యంగా పోరాడితేనే కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం అవుతాయని ఐఎన్‌‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ జి.సంజీవరెడ్డి అన్నారు. ఉద్యోగులు, కార్మికులకు కనీస వేతనాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మంగళవారం బాగ్‌‌లింగంపల్లిలోని వీఎస్‌‌టీ హాల్‌‌లో ఐకేపీ వీఓఏ అసోసియేషన్ తొలి మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 

అసోసియేషన్ గౌరవ సలహాదారు వై. నాగన్న గౌడ్ అధ్యక్షతన జరిగిన సభకు డాక్టర్ జి.సంజీవరెడ్డితో పాటు రాష్ట్ర కనీస వేతనాల మండలి చైర్మన్ జనక్ ప్రసాద్, మొగుళ్ల రాజిరెడ్డి, ఆర్డీ చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం సానుకూల దృక్పథంతో అనేక సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతోందన్నారు. ఐకేపీ వీఓఏ ఉద్యోగుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.