తమిళనాడు పాలిటిక్స్..కొత్త పార్టీ జెండా ఆవిష్కరించిన శశికళ

తమిళనాడు పాలిటిక్స్..కొత్త పార్టీ  జెండా ఆవిష్కరించిన శశికళ

తమిళనాడు పాలిటిక్స్ కీలక అప్డేట్స్.. మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ కొత్త పార్టీ పెడుతున్నట్లు  ప్రకటించిన విషయం తెలిసిందే..  తాజాగా జయలలిత జయంతి సభలో పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ పేరును త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. పేదలు, అణగారిన వర్గాలకోసం తమ పార్టీ పనిచేస్తుందన్నారు శశికళ. 

తమిళనాడులోని రామనాథపురం జిల్లా కుముదిలో బుధవారం ( ఫిబ్రవరి 25)  జరిగిన మాజీ సీఎం జయలలిత జయంతి వేడుకల్లో కొత్త పార్టీ ప్రకటన చేశారు శశికళ. జయలలిత, అన్నాదురై, ఎంజీఆర్ ఫోటోలతో పార్టీ జెండాను ఆవిష్కరించారు.  త్వరలో కొత్త పార్టీ పేరును వెల్లడిస్తామన్నారు. 

జయలలితకు 30 యేళ్లకు పైగా అత్యంత సన్నిహితంగా ఉన్న శశికళ..ఆమె పాలనలో తెరవెనక శక్తివంతమైన వ్యక్తిగా కొనసాగారు. 2016 డిసెంబర్ లో జయలలిత మరణానంతరం క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన  శశికళ..అన్నా డీఎంకే ప్రధాని కార్యదర్శిగా నియమితులయ్యారు. అనంతరం జరగిన పరిణామాలతో జైలు జీవితం అనుభవించారు శశికళ.