ఓటింగ్ కు ముందే ఫలితాలు సిద్దం చేశారు.. సాక్ష్యం దూరదర్శన్ ప్రసారాలే: మల్లికార్జున్ ఖర్గే

ఓటింగ్ కు ముందే ఫలితాలు సిద్దం చేశారు.. సాక్ష్యం దూరదర్శన్  ప్రసారాలే: మల్లికార్జున్ ఖర్గే

బీహార్​ లో ఓటింగ్ కు ముందే ఫలితాలు సిద్దం చేశారా?.. తుది దశ పోలింగ్​ జరగక ముందే ఎన్డీయే గెలుపు ఖాయమైందా?.. దీనికి  కేరళ దూరదర్శన్​ లో ప్రసారాలు సాక్ష్యం అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే ఆరోపణలు నిజమేనా..బీహార్​ లో ఏం జరుగుతోంది..? 

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే సంచలన పోస్ట్​ చేశారు. సోషల్​ మీడియా ప్లాట్​ ఫాం X లో స్పందిస్తూ.. బీహార్​ లో ఎన్నికల ఫలితాలు పోలింగ్​ కు ముందే సిద్దం అయ్యాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వ అధికారిక చానల్​ దూరదర్శన్​ లో వస్తున్న ప్రసారాలే అందుకు సాక్ష్యం.. అని ఖర్చే పోస్ట్​ చేశారు. 

బీహార్​ ఎన్నికల్లో మొదటి దశ ఓటింగ్​తర్వాత ఎన్డీయే ఆధిక్యంలో ఉందని, రెండో దశలో కూడా ఈ ట్రెండ్​ కొనసాగుతుందని పబ్లిక్​ బ్రాడ్​ కాస్టర్ దూరదర్శన్​ ప్రసారం చేయడాన్ని  ఖర్చే తీవ్రంగా తప్పుబట్టారు. రెండో దశలో కూడా ఎన్డీయే ఆధిక్యంలో ఉందని ఎలా తెలుసు అని ప్రశ్నించారు ఖర్గే. 

బీహార్​ లో అధికారిక ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే ముందు ఎన్డీయే ఇలాంటి అంచనాలు చేయడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నవంబర్​ 14న లెక్కింపు ఉంది.. ఓటింగ్​ పూర్తయ్యే లోపు ఫలితాలు సిద్దంగా ఉన్నాయా? అయితే ప్రచురించొచ్చు కదా డబ్బు, సమయం ఆదా అవుతాయి అంటూ విమర్శలు చేశారు ఖర్గే. 

నవంబర్ 14న బీహార్ ఎన్నికల ఫలితాలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో నవంబర్ 6న మొత్తం 121 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండు దశలుగా జరిగిన ఈ మారథాన్‌లో నవంబర్ 11న 122 స్థానాలకు రెండవ దశ పోలింగ్ జరగనుంది. మొత్తం 243 స్థానాల అసెంబ్లీకి ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.